సాధారణ దగ్గు మరియు జలుబు నుండి బయటపడటానికి చుక్కు కాపి చాల బాగా పనిచేస్తుంది. అది ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసినవి
4 కప్పుల నీరు
1 టేబుల్ స్పూన్ – శొంఠి పొడి
1 టీస్పూన్ – నల్ల మిరియాలు పొడి
1 టేబుల్ స్పూన్ – ఇన్స్టంట్ కాఫీ పౌడర్( Bru / Nescafe )
20 తులసి ఆకులు / 1 టేబుల్ స్పూన్ తులసి పొడి
1 టీస్పూన్ – జీలకర్ర (జీరా)
4 ఏలకులు (ఇలాచీ)
3 టేబుల్ స్పూన్లు బెల్లం, (రుచికి సరిపడా )
1/4 టీస్పూన్ ఉప్పు, (లేదా సరిపడా)
చుక్కు కాపి ఎలా తయారు చేయాలి – శొంఠి పొడి కాఫీ రెసిపీ
- ముందుగా ఒక గిన్నె లో నీరు మరగబెట్టాలి.
- నీరు మరిగిన తర్వాత బెల్లం వేసి అది కరిగిపోయే వరకు కదిలించు.
- బెల్లం కరిగిన తర్వాత, శొంఠి పొడి, జీలకర్ర, కాఫీ పౌడర్, నల్ల మిరియాలు వేసి సుమారు 4 నిమిషాలు ఉడకబెట్టండి.
- ఇప్పుడు తులసి ఆకులను/తులసి పొడిని వేసి మిశ్రమాన్ని 2-3 నిమిషాలు ఉడకనివ్వండి.
- పూర్తయిన తర్వాత ఏలకుల పొడి, కొంచెం ఉప్పు వేసి వేడిని ఆపివేయండి.
- సాధారణ దగ్గు మరియు జలుబు నుండి బయటపడటానికి చుక్కు కాపిని తాగావచు , ఉదయం మరియు సాయంత్రం వేడిగా ట్రై చేయండి.
ఈ చుక్కు కాఫీ అమెజాన్ లో రెడీమేడ్ పొడి లాగ కూడా లభిస్తుంది. – మీరు ఈ లింక్ ద్వారా అమెజాన్ లో పొందవచ్చు https://amzn.to/2CE86M3

