మూలికా ఉపయోగాలు వ్యాధులు-ఔషదాలు

Medicinal fumes(dhoop) for clean surroundings at home

మన పెద్దలు, ప్రతి వారం తలంటు పోయగానే, జుట్టు సరిగా ఆరుతుందని సాంబ్రాణి పొగ వేసేవారు, కొంతమంది ఇప్పటికి కుడా చిన్న పిల్లలకు స్నానము చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తున్నారు.

అయితే, ఈ మధ్య , ఈ కోవిడ్ కారణంగా అలంటి ఒక ధూపం చాల ప్రాచుర్యం పొందింది. వివరాలు చుస్తే, అది మనకు కొత్త గాని, కేరళా వారికీ కాదు. ఈ ధూపం అష్టాంగ హృదయం అన్న పుస్తకం లో “జ్వర” నివారణకు చెప్పబడింది. దాని పేరు “అపరాజిత ధూపం”. అపరాజిత ధూపం అంటు జ్వరం యొక్క వ్యాప్తి నిరోధిస్తుంది, మరియు గాలిలో వ్యాప్తి చెందిన వ్యాధికారక క్రిమి కణాలను సంహరిస్తుంది అని చెప్పబడిన్ది.

2006 సంవత్సరం లో, కేరళ లోని ప్రముఖ ఆయుర్వేద సంస్థ ఆ ధూపం మీద రీసెర్చ్ కూడా చేసారు.

వారి అధ్యయనం లో , అపరాజిత ధూమ చూర్నం తో వారి కర్మాగారం లో ధూపం వేసి ఆ పరిసర ప్రాంతాలను పారశీలించగా, అక్కడ బాక్టరీయా మరియు వైరస్లు చాల శాతం తగ్గిపోయినట్లు వారు గమనించారు.
ఇండియన్ ఎక్సప్రెస్ వారి వార్త ప్రకారం ,

కేరళలో, ఇది ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ విభాగం ద్వారా రాష్ట్రం అంతా పంపిణీ చేయబడుతుంది . చికున్‌గున్యా మరియు డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తి సమయంలో సమర్థవంతంగా ఉపయోగించబడుతోంది.మరియు వరదలు వచ్చిన తరువాత సంక్రమించే వ్యాధులను నివారించడానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

అంతేకాదు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యులు – షమికా రవి – మహమ్మారి నేపథ్యంలో పరిసరాలను క్రిమిసంహారక చేయడానికి దీన్ని ఉపోయోగించవచ్చని సూచించారు.

మీరు కూడా ఆ ధూపం తెప్పించుకోవాలంటే , అమెజాన్ లో ఇక్కడ దొరుకుతోంది : https://amzn.to/2XWe2HK

Note :“HerbalRemedyKit.in  is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to amazon.in .”

Photo by Nihal Demirci on Unsplash

వ్యాఖ్యానించండి