ఈ రీసెర్చ్ ప్రకారం , దక్షణ భారత దేశం లో 22.2% జనాభా అసిడిటీ తో బాధపడుతున్నారు. మరి అలాంటప్పుడు, ఈ అసిడిటీ కలుగ కుండా చూసు కోవడం చాలా సులభం. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిమ్మలిని మీరు అసిడిటీ నుంచి కాపాడు కోవచ్చు.
- పూర్తిగా ఆకలి వేస్తే తప్ప భోజనం చేయకండి.
- మానసిక, ఒత్తిడి, కోపం, భయం, విసుగు, విచారం మరియు ఒంటరితనం వంటి ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడానికి లేదా ఉపశమనం కోసం తినకండి, సామాన్యంగా, ఈ విధంగా చేయడం వల్ల మీ ఝాటరాగ్ని (అంటే తిన్నది జీర్ణం అవడం కోసం కావల్సిని అగ్ని) తన పని తాను చేయదు, మరియు దాని వాళ్ళ కూడా అసిడిటీ కలుగుతుంది.
- రోజుకు 2-3 సార్లు మాత్రమే తినండి, వీలైనంత వరకు చిరుతిళ్ళు మాని వేయండి. ఇది , ఈ మధ్య మీరు తెలుసుకున్నడానికి విరుద్ధంగా ఉండచ్చు.
- భోజనం మధ్యలో గాని తర్వాత గాని చల్లని నీళ్లు గాని, కూల్ డ్రింక్స్ గాని తాగకండి. కుదిరితే , తింటున్నప్పుడు , గోరు వెచ్చని నీరు తాగండి.
- అన్నం తినేటప్పుడు 1/3 భాగం ఆహరం తో, 1/3 భాగం నీటితో నిండేటట్లు చూసుకోవాలి.
- జీర్ణక్రియలో లాలాజలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. లాలాజలం బాగా కలిసేటట్లు మీ ఆహారాన్ని బాగా నమలండి.
- భోజనం తర్వాత ఒక కప్పు లస్సీ/మజ్జిగ తాగడం మంచిది. . 1 టీ కప్పు నీటిలో 4 టీస్పూన్ల పెరుగును 2 చిటికెడు అల్లం మరియు జీలకర్ర పొడితో కలపి తాగితే బావుంటుంది.
- యోగ వల్ల తిన్న ఆహరం సులభంగా జీర్ణం అయి అసిడిటీ రాకుండా ఉంటుంది. లెగ్ లిఫ్ట్స్ – ఈ సులభమైన యోగ చేయవచ్చు – ఎలా చేయాలో ఇక్కడ చుడండి https://www.wikihow.com/Do-Leg-Lifts
- బ్రీత్ ఆఫ్ ఫైర్ అని పిలువబడే ప్రాణాయామం (శ్వాస వ్యాయామం) మీ జీర్ణ క్రియ ను పెంచడానికి సహాయబడుతుంది.

