మనం తినే ఆహరం లో ఈ ఆరు రుచులు ఉండాలి అని పెద్దలు చెప్పేవారు, ఎందుకో తెలుసా?
షడ్రుచులు అంటే 6 రకాల రుచులు – అవి – మధురం, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఉగాది కి ఈ 6 రుచులు వున్న ఉగాది పచ్చడి తినాలి అని చెప్తారు. అయితే మన పూర్వీకుల ప్రకారం, మనం రోజు తినే ఆహరం లో కూడా ఈ 6 రుచులు ఉంటే మంచిది.
ఈ 6 రుచులు మన శరీరానికి ఒక్కొక్క విధంగా సహాయం చేస్తాయి.
మధురం :
మధుర రసం గల పదార్థములు భుజించుట వాల్ల రక్తము, బుద్ధి, మేధో వృద్ధి కలుగుతుంది.
పులుపు :
పులుపు పదార్థముల ద్వారా మజ్జారసం అంటే ఆహరం జీర్ణం అవడానికి అవసరమైన రసములు ఉత్పత్తి అవుతాయి.
ఉప్పు :
లవణ రసం వల్ల దంతములు,ఎముకలు గట్టిపడతాయి. శరీర ధారుడ్యము, ఒడ్డు, పొడుగు వృద్ధి అవును.
కారం :
కారపు పదార్థాలు ద్వారా శరీరం లో మాంసం, కండలు వృద్ధి అవుతాయి
చేదు :
చేదు పదార్థాలు వాళ్ళ మెదడు రేతస్సు నరముల ధారణ శక్తి పెరుగుతుంది.
వగరు :
వగరు పదార్థాలు ద్వారా పిత్త రసం(జీర్ణక్రియకు సహాయపడుతుంది), మధుర రసం మొదలగునవి ఉత్పత్తి అవుతాయి.
షడ్రుచులన్న ఆహరం వల్ల శరీరంలో కాలేయం, ప్రేగులు, హృదయం మొదలు ధాతువులకు పుష్టి కలుగుతుంది.

