గృహ వైద్యం మూలికా ఉపయోగాలు

ఉసిరిక (ఆమ్లా) : వాడుక విధానం – ఉపయోగాలు

భారతదేశ సంస్కృతి లో ఒక సంప్రదాయం ఉంది. మనం రోజు వాడుకొనే పదార్థాలలో విశేషమైన గుణాలు కలగిని వాటిని అందరికి అందేలా చేయడం కోసం, ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ ఉపయోగించేట్టు చేసెందుకు ఓక పద్దతిని వాడుకలో పెట్టేవారు. ఉసిరిక వాడుక పెంచుటకు , దాని మంచి గుణాలు అందరికి అందించటానికి కుడా ఒక పద్ధతి పెట్టారు, అదేమిటంటే, నెలలో కనీసం 2 సార్లు (సాధారణంగా ఏకాదశి నాడు ) ఉపవాసం చేయాలని , ఆ తర్వాతి రోజు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద “ఉసిరి కాయ పచ్చడి” తో తినాలి అని పెట్టారు.

వినడానికి కొంచం విడ్డురంగా వున్నా, ఇప్పుడు అర్థం అయ్యింది కద అసలు కారణం? ఈ విధంగ అయినా అందరికి ఉసిరి లోని ఔషధ గుణాలు లభిస్తాయని వారి ప్రయత్నం.

ఈ విధంగా, ఒక్కొక్క పదార్ధ గుణాలను అందరికి అందించే ప్రయత్నం చేసారు మన పెద్దలు. ఈ పోస్ట్ లో మనం ఆమ్లా (ఉసిరి) యొక్క గుణాల గురించి తెలుసు కొందాం , అంతా చదివితే మీకే అర్థం అవుతుంది, ఉసిరి యొక్క గొప్పతనం ఏమిటో.

ఆమ్లా చూర్ణం ఉపయోగాలు :

కొలెస్ట్రాల్ తగ్గించడానికి:

ప్రతి రోజూ పాడుకొనే ముందు , ఒక గ్రాము (1 Gram ) ఆమ్లా పొడి ఒక గ్లాసు నీళ్ల లో కలిపి తాగడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చు .

అసిడిటీ /అల్సర్లు నుండి ఉపశమనం కోసం :

ఆమ్లా పొడిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో మంచి నీళ్లతో తెసుకోంట్లైన అసిడిటీ,అల్సర్స్ ని నియంత్రిచ వచ్చు

ఆకలి పెంచటానికి :

భోజనం ముందు, వెన్న మరియు తేనెతో తీసుకున్నప్పుడు ఆమ్లా పౌడర్ మీ ఆకలిని పెంచుతుంది.

గొంతు మరియు జలుబును నయం చేయడానికి:

గొంతు మరియు జలుబును నయం చేయడానికి ఆమ్లా సహాయపడుతుంది. 2 టీ స్పూన్ల తేనెతో 2 టీ స్పూన్ల ఆమ్లా పౌడర్ (4 గ్రా.) కలపి తీసుకోవాలి. మంచి ఫలితాల కోసం రోజులో 3-4 సార్లు తీసుకోవాలి.

ఆమ్లా ఫేషియల్ :

ఆమ్లా పౌడర్ మరియు తేనెను పెరుగుతో కలపి మందపాటి పేస్ట్‌ను తయారుచేయాల..దీన్ని మీ చర్మంపై అప్లై చేసి సుమారు 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగ చేయడం వల్ల మీ చర్మం శుభ్రపడి మరియు మృదువుగా అవుతుంది . ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు చేయవచ్చు.

మొటిమల కోసం:

ముందుగా టీ ఆకులను నీటిలో ఉడకబెట్టి కాషాయం(డికాక్షన్)కాచాలి. ఆ కషాయం చల్లారిన తర్వాత వాడకొట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానిని సరిపోయినంత అమ్లా పౌడర్ కలపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ పేస్ట్ కి తేనె ఒక టీ స్పూన్ (4గ్రాములు .) కలపాలి.. ఇలా తయారైన పేస్ట్ ను మొటిమల నివారణకు ముఖానికి పేస్ ప్యాక్ లాగా వాడవచ్చు . ఆ ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ,గోరువెచ్చని నీటితో కడగాలి.

జుట్టు కోసం :

ఆమ్లా పౌడర్ 1/2 కప్పు మరియు 1/4 కప్పు వెచ్చని నీరు కలపి మందపాటి పేస్ట్ ఏర్పడేలా చేయాలి. ఈ పేస్ట్‌ను తలకు(మాడుకు) వేళ్ళతో అప్లై చేసి, సర్కిల్‌లలో వేళ్లను తిప్పడం ద్వారా కొంచం సేపుమసాజ్ చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉండనిచ్చి ఆ తర్వాత జుట్టును పూర్తిగా కడగాలి. ఈ విధం గా వారానికి మూడుసార్లు దీన్ని రిపీట్ చేస్తే ఆమ్లా జుట్టుకు పోషకాహారాన్ని ఇస్తుంది మరియు జుట్టును నల్ల చేస్తుంది. చుండ్రును నయం చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని ఆపుతుంది. పేస్ట్ చేసేటప్పుడు మీరు 1/4 కప్పు పెరుగును జోడిస్తే ఇంకా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

Photo by Jametlene Reskp on Unsplash

1 వ్యాఖ్య

వ్యాఖ్యానించండి