మానవ శరీరం లో ఆధారణీయ వేగములు 13 ఉంటాయి అని ఆయుర్వేదం లో చెప్పారు. అవి
- మూతము
- మలము
- శుక్రము
- అపానవాయువు
- వాంతి
- తుమ్ములు
- తేన్పులు
- ఆవలింతలు
- ఆకలి
- దప్పిక
- కన్నీరు
- శ్వా స
- నిద్ర
ఈ 13 ఎప్పుడు గుడా ఆప కూడదు. ఆలా చేయడం వల్ల , లేని పోని రోగాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
మూత్రము ఆపుటవలన వచ్చే వ్యాధులు
అ) మూత్రము పోయుటలో బాధ ఆ) మూత్రంలో రాళ్ళు ఇ) మూత్రాశయము యొక్క కండరాలు పటుత్వము కొల్పోవుట ఈ) మూత్రమార్గములో వాపు మంట కలుగుట వంటివి కలుగుతాయి.
మల విసర్జన ఆపుట వలన వచ్చే వ్యాధులు
అ) కడుపులో నొప్పి ఆ) కడుపుబ్బరము ఇ) అజీర్ణము ఈ) అపానవాయువులు ఉ) తలనొప్పి ఊ) కడుపులో పుండ్లు.
శుక్రము నిరోధించుట : శుక్రము బయటకు పోవు సమయములో నిరోధించినచో వచ్చు వ్యాధులు
అ) శుక్రాశ్మరి ఆ) వృషణములలో నొప్పి ఇ) సంభోగము చేయుటయందు నొప్పి కలుగును
వాంతినాపుట వలన కలుగు వ్యాధులు
సాధరణముగా అజీర్ణము కల్గినపుడు వాంతి కల్గి దోషములు బయటకు పంపివేయబడును. ఇట్టి పరిస్థితిలో వాంతినాపుట వలన – దద్దుర్లు, తల తిరగడము, రక్తహీనత, కడుపులో మంట, చర్మ రోగములు మరియు జ్వరము కలుగును.
తుమ్ములనాపుటవలన కలుగు వ్యాధులు
ముక్కులోనున్న మలినాలు, అనవసర పదార్థములను తొలగించుటకు తుమ్ములు సహాయపడతాయి. వీనిని ఆపుట వలన జలుబు, దీర్ఘ కాలముపాటు ఉండే పీనసము, తలనొప్పి, పార్శ్వపునొప్పి మొదలగు సమస్యలు కలుగును.
త్రేన్పులనాపుటవలన కలుగు వ్యాధులు
ఎక్కిళ్ళు, ఛాతీలో నొప్పి, దగ్గు, ఆకలి మందగించుట , నోరు రుచి లేకపోవుట కలుగును.
ఆవలింతలనాపుటవలన కలుగు వ్యాధులు
కళ్ళు , గొంతు, చెవి ముక్క సంబంధ వ్యాధులుఉత్పన్నమగును
ఆకలి మరియు దప్పిక నాపుట
ఆకలి దప్పికలు శరీరమునకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకతను తెలియచేస్తాయి. వీనిని అతిగా ఆపుటవలన శరీరమునకు కావలసిన పోషకాలు అందక శరీరము క్షీణించిపోతుంది. శరీరమునకు కావల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు కల్గుతాయి. ఆకలి మందగించును మరియు శరీరము పొడిగా మారిపోవును.
కన్నీటి ఆపుట వలన కలుగు లక్షణాలు
సంతోషము, దుఖము వంటి మానసిక స్థితులలో కన్నీరువస్తుంది. కన్నీటిని అపడం అనగా ఈ భావనలను బలవంతముగా అనిచివేయడం వలన మానసిక వ్యాధులు, ఛాతీలో నొప్పి, తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి
శ్వాస ప్రక్రియను ఆపుట
ఉఛ్వాసనిః శ్వాసములను అకారణంగా ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు కలిగి మనిషని ఉక్కిరిబిక్కిరి అయి మృత్యువుకూడా సంభవించవచ్చు.
నిద్రనాపుట వలన కలుగు లక్షణాలు
మెదడు, మనస్సు, జ్ఞానేంద్రియములు, శరీరము అలసినపుడు వ్యక్తికి విశ్రాంతి అవసరము ఈ విశ్రాంతి నిద్ర ద్వారా లభిస్తుంది. బలవంతంగా నిద్రనాపుటవలన నిద్రలేమి, మానసిక వ్యాధులు, జీర్ణకోశవ్యాధులు మరియు జ్ఞానేంద్రియములకు సంబంధించిన వ్యాధులు కలుగును.

