తెలుసుకుందాం

మంచి ఆహారపు అలవాట్లు

  1. ఎప్పుడూ మీ శరీర తత్వాన్ని పట్టి మీరు ఆహారాన్ని తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం, మానవుని ఆరోగ్యం వారి శరీరం లోని త్రిదోషాల (వాత , పిత్త , కఫం ) మీద ఆధార పది ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఎప్పుడు మన శరీరం లో వున్న దోషాన్ని బట్టి జాగ్రతగా ఆహార నియమాలు పాటించాలి. ఉదాహరణకు , వాత శరీర తత్త్వం కలవారు అరటి పండు తక్కువగా తినడం మంచిది.
  2. కాలనీ అనుగుణంగా సరైన ఆహరం తినాలి.
  3. వీలైనంత వరకు – వేడిగా , తాజాగా వున్న, సాత్విక ఆహారాన్ని తినడం మంచిది.
  4. ఆకలి వేస్తే తప్ప తినక పోవడం మంచిది
  5. మీకు దాహం అనిపిస్తే తప్ప తాగవద్దు. మీరు ఆకలితో ఉంటే మరియు తినడానికి బదులుగా తాగితే, ఆ నీరు జీర్ణ వ్యవస్థ లో ఎంజైమ్‌లను కరిగించి మీ గ్యాస్ట్రిక్ మంటను తగ్గిస్తుంది. 
  6. ఎప్పుడు కూర్చొనే ఆహరం తీసుకోవాలి, నిల్చొని తీసుకోకూడదు
  7. ఆహార తీసుకొనేటప్పుడు, మనసు ఆహరం మీదనే ఉండాలి, TV , Phone , books లాంటివి చూస్తూ తినకూడదు
  8. నోటిలో పెట్టునకున్న ముద్ద కనీసం 32 సార్లు నమలాలి. ఆ విధంగా చేయడం వల్ల నోటిలో ఉన్న డైజెస్టివ్ ఎంజయ్మ్స్ తిన్న ఆహారాన్ని సరిగా జీర్ణం చేసేందుకు సహాయ బడతాయి
  9. మరీ వేగంగా లేక మరీ నిదానంగా తినకూడదు.
  10. కడుపు లో 1/3 భాగం భోజనం తో, 1/3 భాగం నీటితో ఉండేట్టు చూడాలి, మిగిలిన 1/3 భాగం ఖాళీగా ఉండేట్టు చూసుకోవాలి.
  11. అతిగా తినకూడదు, ఆలా చేయడం వల్ల , కల క్రమేణ ఎంత తిన్న ఇంకా తినాలి అనిపిస్తుంది.
  12. భోజనం చేసేటప్పుడు, కూల్ డ్రింక్స్, జ్యూస్ లాంటివి తగ కూడదు. కుదిరితే మధ్య మధ్య లో గోరు వెచ్చని నీరు తాగడం మంచిది.
  13. తేనే ఎప్పుడు వండ కూడదు . ఆలా చేయడం వల్ల అది విష పదార్థాలు విడుదల చేస్తుంది.

Source : The Complete Book Of Ayurvedic Home Remedies: A comprehensive guide to the ancient healing of India

వ్యాఖ్యానించండి