గృహ వైద్యం జాగ్రత్తలు

మార్కెట్ లో దొరికే మూలికలు, పొడులు వాడే ముందు తీసుకోవాలిసిన జాగ్రత్తలు

ఈ రోజుల్లో మనకు గృహ వైద్య సలహాలు దొరకని చోటు లేదు, యూట్యూబ్ లో, న్యూస్ పేపర్స్ లో, వాట్సాప్ లో ఎక్కడ చుస్తే అక్కడ దొరుకుతాయి.

కానీ ఆ వైద్య సలహాలు పాటించే ముందు తెసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇంతకముందు మీకు వివరించాము. ఈ పోస్ట్ లో, ఆ సలహాలు పాటించడానికి కావలిసిన మూలికలు, పొడులు కొనే ముందు తీసుకోవాలిసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.

మీరు చుసిన గృహ వైద్య సలహా సరైనదే అని నిర్ణయించుకున్న తరవాత, ఆ సలహా పాటించటానికి కావలసిని మూలికలు, పొడులు సమకూర్చుకోవాలి. ఈ పని చేసేముందు మీరు ఈ క్రింది విషయాలు గుర్తు పెట్టుంకోండి.

  • ఏదైనా మొక్క పేరు చెప్పినప్పుడు , ఆ మొక్క లో ఏ భాగమో సరిగా తెలుసుకోండి. ఎందుకంటే మొక్కలో వుండే భాగాలూ – మొక్క వేరు, ఆకులు , బెరడు , వాటిలో ఒక్కొక్క భాగానికి ఓకే గుణం ఉంటుంది. కాబట్టి, ఆ విషయం చూసుకోండి.
  • ఈ రోజుల్లో చాల వరకు , రెడీ మేడ్ పౌడర్లు లభిస్తున్నాయి , ఆ పొడి ప్యాక్ మీద , ఆ పొడి ఏ భాగం తో చేసిందో క్లియర్ గ రాసి ఉంటుంది.
  • వీలైన వరకు ముడి మేలికలు కొనకండి, ఎందు కంటే, కొన్ని మూలికలు సుద్ధి చేయవలిసి వస్తుంది. ఆ ప్రక్రియ అందరికి తెలియక పోవచ్చు, మీకు సలహా ఇచ్చిన వారు అది చెప్పి ఉంటే పర్లేదు. అంతే కాదు , ఆ మూలికలు మట్టి అవి లేకుండా సరిగా కడుక్కోవాలి.
  • ఇక రెడీ మేడ్ పౌడర్లు కొనే ముందు ఇంకొన్ని జాగ్రత్తలు పాటించాలి
    • భారత ప్రభుత్వం ప్రకారం, హెర్బల్ పౌడర్లు చేసే వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, మీరు కొనే పొడి చేసిన వారికి ఆ లైసెన్స్ ఉంటే వారు కచ్చితంగా ఆ లైసెన్స్ నెంబర్ లేబుల్ పైన ప్రింట్ చేయాలి.
    • ఆ తర్వాత , ఆ తయారీ దారికి GMP ( Good Manufacturing Practices) లైసెన్స్ ఉండాలి. ఆ GMP వివరాలు కూడా మీరు కొనే బాటిల్/ప్యాక్ పైన ప్రింట్ చేయాలి.
    • ఇంకా,అన్ని మందులు కొన్నట్టు , ఎక్సపెరీ డేట్ కూడా సరి చూసుకోవాలి.
  • ఒకటి ఏమిటంటే , ఈ మూలికలు కూడా మొక్కలే అంటే వాటికి కూడా తెగులు అవి రాకుండా పురుగు మందులు వాడి ఉండచ్చు. కాబట్టి , సరైన తయారీ దారులు ఈ విషయం తెలుసు కొని, మొక్కలను, మూలికలను సరిగా కడిగి పొడులు చేస్తారు. అంతే కాదు , భారత ప్రభుత్వం వారు ఔషధ మొక్కలు ఎలా పెంచాలి, ఎలా సాగు చేయాలి అని ఎన్నో నియమాలు కూడా విడుదల చేసాయి.
  • కొన్ని ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు అయితే , ఆ పురుగు మందులు లేని ఆర్గానిక్ (Organic) మూలికా పొడులు మాత్రమే అమ్ముతయారు. మరి కొందరు, పొడి తయారు ఐన తర్వాత , దానిలో ఎటువంటి పెస్టిసైడ్స్ లేవని క్వాలిటీ టెస్ట్ లు చేయించి ఆ వివరాలు ప్యాక్ మీద రాస్తుంటారు.

చివరగా, వీలైన అంత వరకు, చిన్న చిన్న ఇబ్బందులకే ఈ గృహ వైద్య సలహాలు పాటించడం మంచిది. దీర్ఘ కాలిక రోగాలు వున్నా వారు డాక్టర్ సలహాలు పాటిస్తూ , వారి సలహా తో గృహ వైద్య చిట్కాలు పాటించ వచ్చు.

ఉదాహరణ కి , ఈ కింది ఫోటో చుడండి, దీంట్లో – GMP, లైసెన్స్ మరియు ఈ పొడి ఏ భాగం నుంచి చేయబడిందో రాసి ఉంటుంది. ఈ ఫోటో Amazon నుంచి తీసుకొనబడింది

1 వ్యాఖ్య

వ్యాఖ్యానించండి