తెలుసుకుందాం

మన పూర్వీకులు చెప్పినట్టు దంత ధావనానికి (పళ్ళు తోముకోవటానికి) ఏమి వాడాలి?

herbal brushing sticks
herbal brushing sticks

1938 లో మొట్ట మొదటి సారి నైలాన్ బ్రెసెల్స్ తో చేసిన టూత్ బ్రష్ లు ప్రపంచం లో వాడుకలోకి వచ్చాయి. భారత దేశం లో అయితే 1949 లో అజంతా వారు టూత్ బ్రష్ లు చేయడం మొదలు పెట్టారు.

అప్పటి వరుకు? మీకు చెప్పనవసరం లేదు అందరు “పుల్లల” నే బ్రష్ గా వాడేవారు.

ఇంత వరకు బానే వుంది. మరి ఏ పుల్లలు వాడే వారు? మనం అయితే ఇప్పుడు వేప (నీమ్ ) పుల్లలను వాడుతున్నాం . అయితే ఆయుర్వేదం ప్రకారం, ఏ పుల్ల వాడాలి అనే దానికి కూడా ఒక లెక్క వుంది.

తెలుసుకుందాం రండి.!

ప్రాచీన గ్రంధాల ప్రకారం ( యోగరత్నాకరం/ అష్టాంగ హృదయం ) ప్రకారం పళ్ళు తోముకునే పుల్ల (పుడక అంటారు) 12 అంగుళాలు పొడవు ఉండాలి, మరియు చిటికెన వేలు అంత లావు ఉండాలి. తోముకునే మూడు పండ్లతో చక్క గ నమిలి పట్టు లాగ చేయాలి. ఆ తర్వాత ఉపయోగిస్తే మంచిది.

తోముకునేటప్పుడు చిగ్గుళ్లకు తగలకుండా వాటికి బాధ కలుగకుండా జాగ్రత్తగా తోముకోవాలి. అన్నింటి కన్నా ముఖ్యం- తోముకునేటప్పుడు తూర్పు(ఈస్ట్) వైపు గాని, ఉత్తరం (నార్త్)వైపు గాని కూర్చుని చేయాలి . నుంచుని గాని తిరుగుతూ గాని చేయరాదు. దంతధావనము చేసిన మిూదట వేడినీళ్ళతో గండూషము(నీళ్లు పుక్కిలించి) చేసి బంగారు లేక వెండి రేకుతో(!!!!) గాని తాటియాకుతో గాని నాలుకను గీసుకోవాలి . ఇది పుస్తకం ప్రకారం, కానీ ఈ రోజుల్లో చాలా మంది స్టీల్ గాని, రాగి తో గాని చేస్తున్నారు.

ఇక పుల్లల విషయానికి వస్తే – పెద్దవారు 4 ముఖ్యమైన రకాల పుల్లలు చెప్పారు. అవి

మధురం(తీపి) రుచికి ఇప్ప కాడ
కారం రుచికి కానుగ కాడ
చేదు రుచికి వేప
వగరు రుచికి చండ్ర కాడ వాడచ్చు

ఈ రుచులు ఎందుకు చెప్పారంటే? కాలాన్ని బట్టి, మనిషి శరీర తత్వాన్ని బట్టి సరిపడ పుల్ల వాడాలి.

ఒక విషయం ఏమిటంటే – కేవలం పుల్ల తో తోమితే మాత్రమే సరిపోతుంది అని వారు చెప్పారు. పుల్లల తో తోముకోలేని వారు, ఔషధ చూర్ణం తో వేలిని వుపయోగించి తోముకోవచ్చు . ఈ చూర్ణాలు చాలా రకాలు వున్నాయి, వాటి గురించి ఇంకో పోస్ట్ లో తెలుసుకుందాం.

మీరు ఎప్పుడైనా పుల్ల తో తోముకొన్నారా? మీ అనుభవం ఏమిటి , ఇక్కడ కామెంట్ చేయండి.

వ్యాఖ్యానించండి