ఆయుర్వేదం ప్రకారం పథ్యం మీకు వున్నా వ్యాధికి గాని ముందుకు కాదు. ఆయుర్వేదం ప్రకారం మన ఆహార వ్యవహారాలు వ్యాధులకు కారణాలు. కాబట్టి ఆహార మార్పుల ద్వారా కొంత మందుల ద్వారా కొంత ఆయుర్వేదం వ్యాధిని నయం చేసే ప్రయత్నిస్తుంది .
ఉదాహరణ కి
మీరు ఇల్లు తడి నీళ్ల తో (గుడ్డ తో ) తుడుస్తున్నారు అనుకొండి. ఇంతలో ఆ నేల పూర్తిగా ఆరక ముందే ఎవరైనా మురికి బూట్లతో నడుస్తుంటే ఏమి జరుగుతుందో మీకు తెలుసు . ఆ బూట్లకు వున్న మురికి నేల అంతా మళ్లీ మురికిగా చేస్తుంది, మీరు దాన్ని మళ్లీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంటే పథ్యం పాటించక పోవడం వల్ల, మీ సిస్టమ్ నయమయ్యే ముందే మీరు మళ్లీ మళ్లీ దోషం కలిగించే ఆహరం తో కలుషితం చేస్తారు.
ఆయుర్వేద చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం, వ్యాధి యొక్క మూల కారణాన్ని నివారించడం. ఇది లీక్ అవుతున్న వాటర్ ట్యాంక్ మళ్ళీ నింపే ముందు లీక్‌ను సరిచేయడం లాంటిది. పథ్యం + మందు కలిసి మీ శరీరం లో వుండే లీక్స్ అన్ని ఫిల్ చేస్తాయి . తద్వారా మీ వ్యాధి నయమవుతుంది.
ఆ తర్వాత మీకు కావలసినది తినవచ్చు మరియు మలినాలను మరియు విషాన్ని సులభంగా తొలగించేంతగా శరీరం బలాన్ని సమకూర్చుకుంటుంది.
మన అందరికి తెలిసిన ఇంకో ఉదాహరణ , షుగర్ (డయాబెటిస్) వున్న వారు పంచదార, స్వీట్స్ తినకూడదు అంటారు , అంటే ఈ పథ్యం షుగర్ వ్యాధికి గాని మీరు వేసుకొనే ముందుకు కాదు.
ఆయుర్వేదం లో ఇలాగే , అన్ని వ్యాధులకు పథ్యం ఉంటుంది అంతే. మందులు వాడుతూ పథ్యం చేస్తే ,మీ ఇబ్బందులు/వ్యాధులు త్వరగానయం అయ్యే అవకాశాలు వున్నాయి.
మీ అనుభవం ఏమిటి? మీరు నాతో అంగీకరిస్తారా? కామెంట్ చేయండి.

