ఇది నిజం , ఆయుర్వేదమే కాదు అల్లోపతి, హోమియోపతి మారే దాంట్లోనూ కరోనా కి మందు లేదు.
కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కదా అంటారా? అది , కేవలం మీ ఇమ్మ్యూనిటి పెంచుకోవడానికి మాత్రమే. కొరోనా తగ్గించటానికి కాదు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం “రసాయన” ఔషదాలు అనే ఒక తరహా ఔషదాలు ఉంటాయి. ఆయుష్ వారు చెప్పినవి ఇలాంటివే.
వారు చెప్పిన ఔషదాలు ఇవి.
- చ్యవనప్రాశ
- అగస్త్య హారతికి రసాయనం.
- మరియు తులసి, మిర్యాలు, శొంఠి, దాల్చిని , ఎండు ద్రాక్ష తో చేసిన కాషాయం. దీంట్లో కావాలంటే కొంచం బెల్లం కానీ నిమ్మకాయ రసం గాని కలపవచ్చు.
అయితే , ఇవి హెర్బల్ మెడిసిన్ కావటం వల్ల. ఇవ్వాళా వాడితే రేపటికి ఇమ్మ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) పెరగదు. ఇమ్మ్యూనిటి అనేది మన ఆహార వ్యవహారాల ద్వారా కాల క్రమేణా పెరగాల్సిందే . అంటే, ఆయుర్వేదం సూచించినట్టు పౌష్టిక ఆహరం తీసుకొంటూ, తగినట్టు వ్యాయాయం చేయడం ద్వారా పెరుగు తుంది అన్నమాట.
ఈ పోస్ట్ ఎందుకు రాయవలిసి వచ్చిందంటే , టిక్ టాక్ లో ఎదో చూసి, ఉమ్మెత్త కాయల్లోని గింజల రసం తాగితే కరోనా వైరస్ సోకదని వస్తున్న విషయాన్ని ఎవరో చెప్పారని ఆ రసాన్ని తాగి ఎనిమిది మంది అస్వస్థతకు గురైయ్యారు . ఈనాడు వార్త చూడండి
Update :
22 April 2020 నాటికి బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెస్సొర్స్ AIMIL అనే ఆయుర్వేదిక్ ఫార్మసిటీకాల్ కకంపెనీ తాయారు చేసే “FIFA TROL” ను ఉపయోగించి “క్లినికల్ ట్రయల్స్ ” చేయాలనీ ప్రతిపాదించారు. FIFA TROL , సాధారణంగా ఫ్లూ , శ్వాస కోశ సంభందించిన వ్యాధులకు వాడతారు. ఇప్పటి వరకు అది కరోనా వ్యాధిని తగ్గించగలదని రుజువు లేదు.
కాబట్టి, ప్రస్తుతానికి, చేతులు కడుక్కోవడం , భౌతిక దూరం పాటించడం, ప్రభత్వం చెప్పినట్టు అవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఇంట్లో ఉండడం. ఇదే మనం చేయగలిగినది.

