రిలయన్స్ జియో వచ్చిన తరవాత డేటా గురించి ఆలోచించ కుండా అందరు 24 గంటలు ఇంటర్నెట్ వాడుకొనే అవకాశం వచ్చింది. అయితే, ఇంటర్నెట్ ఎంత అవసరమైందో అంతే చెడ్డది కూడా. అందులో ఉండేవన్నీ నిజం కాదు అని మనం తెలుసు కోవాలి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో ఆరోగ్యానికి సంభందించి ఓకే వీడియో చూసినప్పుడు, ఆ వీడియో లో చెప్పిన సలహా పాటించే ముందు ఇవి చెక్ చేసుకోండి.
- ఆ వీడియో పోస్ట్ చేసిన వారి అర్హతలు ఏంటి?
- వారికి డాక్టర్ డిగ్రీ వుందా?
- వారు చెప్పిన వైద్య సలహా ఇంతకు ముందు ఎవరైనా వాడి తగ్గినట్టు రుజువు వుందా?
- రుజువు లేకపోతే ఏదైనా గవర్నమెంట్ గాని/ ఆరోగ్య సంస్థ ప్రచురించిన పుస్తకంలో వుందా? లేకపోతే ఆ వీడియో పెట్టిన వారిని అడగాలి
ఆ వీడియో విడుదల చేసిన వారు, ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పక పోతే, మీరు ఆ సలహా పాటించక పోవడమే మంచిది. ఎందుకంటే , చాల మంది, తెలిసి తెలియక వారు ఎదో వాట్సాప్ లో చుసిన/చదివిన మెసేజ్ నే వీడియో గ మార్చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అయితే అన్ని సలహాలు మనకు హాని చేయక పోవచ్చు, కానీ కొన్ని ఆ వ్యాధి నయం చేయక పొగ, కొత్తవి కలుగ చేయవచ్చు. అందు వలన , రుజువు లేని చిట్కాలు పాటించకు పోవడమే ఎంతో శ్రేయస్కరం . ఎందుకంటే చాలా వీడియోలు ఎన్నో రోజులుగా వున్నా వ్యాధులు చిన్న చిట్కాల తో తగ్గి పోతాయి అని చెప్తుంటాయి. ఒక సారి మీరే ఆలోచించడి, ఇంత చిన్న చిట్కాతో ఒక దీర్ఘకాలిక రోగం తగ్గిపోతే, ఇంకా ఇంత మందికి ఈ వ్యాధి ఎందుకు ఉంటోంది? ఈ చిట్కా ని ఆధారంగా చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు మందులు విడుదల చేయలేదు? మీరే ఆలోచించండి? ఆయుర్వేదం మరియు మూలికలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, కానీ ఏవి ఎలా పనిచేస్తాయో అవి వైద్యులకే తెలుస్తాయి. అంతేకాక, మందుల్లో పడే చాల మూలికలు శుద్ధిచేయబడిన తరవాతే వాడ బడతాయి. కావున, యూట్యూబ్ , వాట్సాప్ లో వచ్చే చిట్కాలు పాటించే ముందు వైద్య సలహా తప్పకుండా తీసుకోండి.

