- దీర్ఘ కాలిక రోగాలను, ఇంటి వైద్యం తో నివారించటానికి ప్రయత్నించకూడదు . దానికి ఆయుర్వేద లేదా ఇతర వైద్య సలహా తప్పక తీసుకోవాలి.
- ఒకటి కంటే ఎక్కువ నివారణలు ప్రయత్నించేప్పుడు జాగ్రత్తగ ఉండవలెను, ఎందుకంటే, ఒక దాని వల్ల వచ్చే లాభాలు మరొకటి తగ్గించ వచ్చు.
- వైద్య సలహా : గృహ వైద్యం లో చెప్పిన సలహాలు పాటించే ముందు , ఆ వైద్యం తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ని కలవడం ఎంతో అవసరం
- మీరు మూలికా చూర్ణం లేదా కాషాయం లాంటివి వాడేముందు , ఆ మూలిక లో వున్నా గుణాలు డాక్టర్ నుండి సరిగా తెలుసుకోవడం మంచిది
- ఈ మూలికల వాల్ల ఎమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయా , మీరు కనక ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటే , ఈ ఇన్ఫర్మేషన్ కచ్చితంగా అడిగి తెలుసోకోవాలి
- ఏయే చూర్ణం లేదా కాషాయం ఎంత మోతాదు లో వేసుకోవాలో కూడా అడిగి తెలుసుకోవడం మంచిది.
- హెర్బల్ పొడి కాషాయం లాంటివి ఎప్పుడు తీసుకొన్నాం అన్న దాని బట్టి అవి ఎలా పని చేస్తాయో ఆధార పడి ఉంటుంది . కాబట్టి, ఏఏ చూర్ణం లేదా కాషాయం ఎల తీసుకోవాలో కచ్చితంగా తెలుసుకోవాలి.
- తర్వాత,మీరు సలహా బట్టి, ఒక్కక్క సారి అనుపానం ,అంటే ,నీరు గాని, తేనే గాని బెల్లం తో గాని తీసుకోవాలి అని చెప్తారు . అది కచ్చితంగా పాటించాలి. మూలిక అనుపానం బట్టి కూడా దాని ప్రభావం మారుతుంది.
- చివరగా, మీ పరిశోధన(రీసెర్చ్) మీరు చేయండి. అవసరం అయితే గూగుల్ లో వెతకండి, కానీ, ఆ సలహా ఏదైనా, గవర్నమెంట్ సంస్థ గాని, వైద్య సంస్థ నుంచి గాని అయి ఉండాలి అని గుర్తు పెట్టు కొండి.
గృహ వైద్య సలహాలను పాటించే ముందు తీసుకో వాల్సిన జాగ్రత్తలు
ఈ సలహాలు పాటించక పోతే , మీరు పాటించే గృహ వైద్య సలహాలు సరిగా పనిచేయక పోవచ్చు.

